హిందూ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు కదిలి రావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా శర్మ హిందూ రాష్ట్ర నిర్మాణానికి ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ కలను నిజం చేసుకోవడానికి కదిలి రావాలన్నారు. శుక్రవారం పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవిడ ప్రజలకు పిలుపునిచ్చారు. “ మనం ఎక్కడ ఉన్నా, హిందూ రాష్ట్రాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మనము హిందువుల గొంతుకై మాట్లాడాలి, హిందువులు కలిసి కట్టుగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది, ”అని ఆవిడ అన్నారు.
ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. అది ఈవిడ వ్యక్తిగత అభిప్రాయమని, ఆవిడ పిలుపుకు పార్టీకి సంబంధం లేదని తెలిపారు. అయితే, తన ప్రకటనను ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నారని అనితా శర్మ స్పష్టం చేశారు. దేశంలో భిన్న మతాలకు చెందిన ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని, ఎవరినీ విచ్ఛిన్నం చేయకూడదనుకుంటున్నామని అన్నారు. బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు సమాజంలో విభజనకు పాల్పడుతున్నందున ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com