Lightning: పిడుగుపడి మొబైల్ పేలి వ్యక్తి మృతి

Lightning: పిడుగుపడి మొబైల్ పేలి వ్యక్తి మృతి
X
ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదం

ఛత్తీస్‌గఢ్ ధమ్తారి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. పిడుగుపడి తీవ్రగాయాలైన వ్యక్తిని సమీపం ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. బాధితుడిని రోహిత్ కుమార్ సిన్హాగా గుర్తించారు.

శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. దీని వల్ల ఒక్కసారిగా అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. పని నుంచి ఇంటికి వచ్చిన రోహిత్, తన ఇంట్లో జరుగుతున్న టాయిలెట్ నిర్మాణ పనులు పరిశీలించడానికి బయటకు వచ్చిన సమయంలో పిడుగు పడింది. మొబైల్ ఫోన్ పేలడానికి పిడుగుపాటు కారణం కావచ్చని రోహిత్‌కి చికత్స చేసిన డాక్టర్ చెప్పారు. మొబైల్ ఫోన్లలో రేడియేషన్, అయస్కాంత భాగాలు పిడుగుపాటును ఆకర్షిస్తాయని డాక్టర్ తెలిపారు.

Tags

Next Story