Chief Election Commission : రాజకీయ పార్టీల ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఫైర్..

Chief Election Commission : రాజకీయ పార్టీల ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఫైర్..
Chief Election Commission : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేసే దిశగా కీలక మార్పులకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది

Chief Election Commission : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేసే దిశగా కీలక మార్పులకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సంఘం లేఖలు రాసింది.. ఉచిత హామీలను ఎలా నెరవేర్చుతారనే విషయాలపై ఓటర్లకు పూర్తి సమాచారం అందించాలని లేఖల్లో పేర్కొంది. ఊరికే ఇచ్చే ఎన్నికల వాగ్దానాలు తీవ్ర అనర్ధాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.. హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు.. అందుకు ఉన్న ఆర్థిక వనరులపై ఓటర్లకు రాజకీయ పార్టీలు స్పష్టంగా తెలియజేయాలని ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. పార్టీలు ప్రజలకు ఇస్తున్న హామీలేంటి? అందులో ఎన్ని అమలు అవుతున్నాయి? ఎన్ని హామీలు నెరవేర్చుతున్నారు? అంటూ పార్టీల హామీల చిట్టాను కూపీ లాగుతోంది. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుతారో కచ్చితమైన సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఉన్న ఆర్థిక వనరులేంటో ఈనెల 19లోపు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం డెడ్‌లైన్ విధించింది.

Tags

Read MoreRead Less
Next Story