Puducherry: ఆడపిల్ల పుడితే రూ. 50వేలు

Puducherry: ఆడపిల్ల పుడితే రూ. 50వేలు
బాలికా శిశు రక్షణ పేరుతో కొత్త పధకం

పుదుచ్చేరి ప్రభుత్వం ఆడ పిల్లలకు అండగా నిలిచేందుకు సిద్ధం అయ్యింది. వారిని కన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం పెద్ద పథకాన్నే ప్రవేశపెట్టింది. మహిళల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళల ఓటు బ్యాంకు పురుషులతో సమానంగా ఉండటంతో వారి ఓట్లు కూడా చాలా ముఖ్యమని పార్టీలు భావిస్తున్నాయి. అందకే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో మహిళల కోసం అనేక పథకాలు పెడుతున్నాయి.

ఇప్పుడు తాజాగా ఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఎవరైనా ఆడపిల్లను కంటే వారి పేరిట బ్యాంకు ఖాతా తెరచి అందుకలో రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మార్చి 17న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం రంగస్వామి ఈ ప్రకటన చేశారు. బాలికా శిశు రక్షణ పథకం కింద ఈ డబ్బు జమ చేస్తారు. ఈ విధంగా అయినా ఆడపిల్లపై వివక్ష తగ్గుతాయన్నారు. ఇక ఈ పథకం ప్రకటించిన తరువాత జన్మించిన 38 మంది ఆడ శిశువులకు బ్యాంకు ఖాతా తెరచి అందులో రూ.50 వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను వారి తల్లికి అందజేశారు. ఇదే కాదు పుదుచ్చేరి ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను అందిస్తుంది. పేద మహిళలకు నెల నెలా రూ.1000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే 13వేలమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇటీవలే మరో 1600 మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు.

ఎలక్షన్ ల ముందు రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై ద్రుష్టి పెరిగింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది. కర్నాటకలో ఇదే రుజువైంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకం అక్కడ విజయవంతమైంది. అమలు చేయడానికి ప్రభుత్వం తిప్పలు పడటం వేరే విషయం.

Tags

Read MoreRead Less
Next Story