Bihar: ఈ బాలుడు... మృత్యుంజయుడు

Bihar: ఈ బాలుడు... మృత్యుంజయుడు
బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌... బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటన

బిహార్‌లో బోరుబావి( borewell)లో పడిన ముడేళ్ల చిన్నారి(3-year-old)ని సిబ్బంది గంటల్లోనే సురక్షితంగా కాపాడారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగలకుండా రక్షించగలిగారు. సిబ్బంది సమన్వయం, అధికారుల పర్యవేక్షణ, శరవేగంగా సాగిన పనులతో చిన్నారిని సురక్షితంగా కాపాడామన్న(rescued shortly) ప్రకటనతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే...


బిహార్‌(Bihar )లోని నలంద జిల్లాలో కుల్‌ గ్రామంలో మూడేళ్ల శివకుమార్‌(Shiva kumar) అనే బాలుడు ఆడుకుంటూ(slipped while playing) వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు(field and fell into the hole). గ్రామ సమీపంలో ఓ రైతు బోరు బావి తవ్వి, అక్కడ నీరు పడకపోవడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. అక్కడే బాలున్ని తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా బావిలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు నలంద నగర పంచాయతీ అధ్యక్షుడు నలిన్ మౌర్య తెలిపాడు.


బోరుబావిలో 40 అడుగుల లోతు(40-foot borewell)లో బాలుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టాయి. బాలుడికి ఆక్సిజన్‌ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి చివరకు ఆ చిన్నారిని కాపాడటంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది.


సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారి శంభు మండల్ తెలిపారు. బాబు ఏడుపు శబ్దం తమకు వినిపిస్తున్నట్లు వెల్లడించారు. జేసీబీ మెషిన్‌ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి బాలుడిని కాపాడగలిగినట్టు తెలిపారు. బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడటంపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బాలుడు బాగానే ఉన్నాడని ఎన్డీఆర్‌ఎఫ్‌(National Disaster Response Force) అధికారి రంజిత్‌ కుమార్‌ వెల్లడించారు. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడింది. ఆ చిన్నారి బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story