ఓటర్లు నోటుకి అమ్ముడు పోవద్దు

ఓటర్లు  నోటుకి అమ్ముడు పోవద్దు
విద్యార్థుల బహుమతి ప్రధాన కార్యక్రమంలో హీరో విజయ్


తమిళ హీరో విజయ్ కి భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. విజయ్ ఇటు మూవీస్ తోనే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా వార్తల్లో నిలవడం ఇందుకు కారణం.

ఇప్పుడు కూడా విజయ్ అందుకే మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైలో పీపుల్స్ మూమెంట్ లో ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయ్. 10వ తరగతి, 12 వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. వీరిలో నందిని అనే విద్యార్థిని అందరూ ఆశ్చర్యపడేలా 600కు 600 మార్కులు సాధించగా ఆమెకు డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారు హీరో. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాదు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడానికి విజయ్ సుమారు 10 గంటల పాటు స్టేజ్ మీద నిలుచున్నారు. తనని ముట్టుకోవాలి అని కోరుకున్న విద్యార్థులను ముట్టుకోమని చెప్పారు. వారి కుటుంబంలోని చిన్న పిల్లలను ఎత్తుకొని మరి ఫోటోలు దిగారు. అందరితోని ప్రేమగా మాట్లాడారు, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. విద్యార్థులు ఎలా కోరితే అలా ఫోటోలు దిగారు.

కొన్ని గంటల తర్వాత అలసిపోయిన విజయ్ రెండు నిమిషాలు ఆగాలంటూ కోరి కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ బహుమతి ప్రధానం, ఫోటో సెషన్ మొదలుపెట్టారు. విజయ్ బహుమతులు ఇచ్చిన ఫోటోలతో పాటు అతను స్టేజి మీద నిలబడటానికి కష్టంగా ఫీలైన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ముగిసేటప్పటికీ రాత్రి 11 గంటలు అయింది. అన్ని గంటల పాటు విద్యార్థుల కోసం వేచి ఉన్న విజయ్ ముఖంపై చిరునవ్వు కూడా చెదరలేదు. దీంతో విజయ్ పై అభిమానులే కాదు నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సందర్భంగా మాట్లాడిన విజయ్ ప్రస్తుత రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. ఓట్లను డబ్బులకు అమ్ముకోవద్దని స్టూడెంట్స్‌కి చెప్పారు. ఈ విషయం ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రులకు కూడా చెప్పవలసిందిగా కోరారు. రేపటి పౌరులు.. రేపటి ఓటర్లు.. భవిష్యత్ నాయకులు కూడా మీరే అని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. రేపటి భవిష్యత్ కూడా మీ చేతులోనే ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story