Amarnath Yatra : ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు... చిక్కుకున్న 12వేల మంది అమర్‌నాథ్ యాత్రికులు

Amarnath Yatra : పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో ఊహకందని భారీ విషాదం నెలకొంది. నింగీనేలా ఒక్కటయ్యేలా కురుస్తున్న రెండు కిలోమీటర్ల మేర కుంభవృష్టితో ఒక్కసారిగా అమర్‌నాథ్‌ను వరదలు ముంచెత్తాయి.కొండవాలుగా భారీ వరద అమర్‌నాథ్ గుహకు సమీపాన్ని తాకింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో పలువురు గల్లంతయ్యారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. టెంట్లు వరదల్లో కొట్టుకుపోయాయి.
వరదల్లో చిక్కుకున్న యాత్రికులను కాపాడడానికి ఎన్డీఆర్‌ఎప్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి లెక్క తేలాల్సి ఉంది. మహా ఉపద్రవంతో అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది.
#AmarnathYatra cloud burst update ...
— DINESH SHARMA (@medineshsharma) July 8, 2022
Five Dead bodies have been recoverd so far from the area down the holy cave, 03 female and two male. https://t.co/ZcMpkPajiL
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com