Coaching Centers: కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్

Coaching Centers: కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్
16 ఏళ్ల లోపువారు వద్దన్న కేంద్రం

16ఏళ్ల కంటే తక్కువ వయసు వారి నుంచి ప్రవేశాలు తీసుకోవద్దని...కేంద్ర విద్యాశాఖ కోచింగ్ సెంటర్లను ఆదేశించింది. సెకండరీ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత మాత్రమే కోచింగ్ ఇచ్చేందుకు చేర్చుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ర్యాంక్ గ్యారంటీ, మంచి మార్కులు వంటి హామీలు ఇవ్వరాదని సూచించింది. విద్యార్థుల ఆత్మహత్యలు పెరగటం, కోచింగ్ సెంటర్లలో సదుపాయాల లేమీ, వారు అనుసరిస్తున్న శిక్షణా విధానాలకు సంబంధించి ఫిర్యాదులు పెరగటంతో...కేంద్రప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. శిక్షణకు సంబంధించి అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా పత్రికా ప్రకటనలు ఇవ్వరాదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కోచింగ్ సెంటర్లలో సౌకర్యాల లేమి, అగ్నిప్రమాదాలు, బోధనా పద్ధతులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఫీజులు న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. పారదర్శకంగా రసీదులు ఉండాలని పేర్కొన్నాయి. కోర్సుల నుంచి నిష్క్రమించే విద్యార్థులకు తిరిగి ఫీజు సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించాయి. మౌలిక సదుపాయాలు, విద్యార్థికి కనీస స్థలం కేటాయింపు, ప్రథమ చికిత్స, వైద్య సౌకర్యాల ఏర్పాటు, విద్యుత్, వెంటిలేషన్, వెలుతురు, తాగునీరు, భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారి కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చునని స్పష్టం చేశాయి. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

అంతే కాదు గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హతలు ఉన్న బోధనా సిబ్బందిని నియమించుకోకూడదు. తల్లిదండ్రులు/విద్యార్థులను కోచింగ్ సెంటర్‌లో చేర్పించుకునేందుకు మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. ర్యాంక్‌లు లేదా మంచి మార్కుల హామీలు ఇవ్వకూడదు. వయసు 16 సంవత్సరాల కంటే తక్కువ విద్యార్థులను చేర్చుకోకూడదు. పాఠశాల స్థాయి విద్య తర్వాత మాత్రమే విద్యార్థులకు ప్రవేశం ఇవ్వాలి. కోచింగ్ నాణ్యత లేదా సౌకర్యాలు, మార్కులు లేదా ర్యాంకులకు సంబంధించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదుని స్పష్టం చేసింది. ఎవరైనా శిక్ష నిచ్చే వ్యక్తి లేదా కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తే మూడు నెలల లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కోచింగ్ తీసుకొని విద్యార్థులకు సైతం మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు రకాల కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఒకే పేరుతో ఎన్నో రకాల ప్రాంతాలలో శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఆయా బ్రాంచీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపారు. వీటితోపాటు నాణ్యమైన వాటన్నిటినీ కూడా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక విద్యార్థికి అవసరమైన కనీస స్థలం ఉన్నప్పుడు మాత్రమే అతడిని చేర్చుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story