Manmohan Singh : కాంగ్రెస్కు బిగ్ షాక్ .. మాజీ ప్రధాని మనవడు రాజీనామా

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. కాగా ఇటీవలే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తారనే ఊహాగానాల మధ్య ఆయన బీజేపీ గూటికి చేరుకోవటం గమనార్హం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com