Congress : మరణించిన వారిని కూడా వదలరా : కాంగ్రెస్

Congress : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్‌పై సిట్ అఫిడవిట్ దాఖలు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. సిట్ అధికారులను వాదనలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేతలు.. పటేల్‌పై కుట్ర పన్నారని ఆరోపించింది. మరణించిన వారిని వదలడం లేదని తీవ్ర విమర్శలు చేసారు. నాటి మారణహోమం నుంచి బయటపడేలా ప్రధాని మోదీ నడుపుతున్న వ్యూహంలో భాగంగానే సిట్ నడుస్తోందని ధ్వజమెత్తారు.
అటు అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కూడా సిట్ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇంత పెద్ద కుట్రలో తన తండ్రి భాగమైతే.. 2020 వరకు కేంద్రం ఆయన్ను ఎందుకు విచారించలేదని పటేల్ కుమార్తె సూటిగా ప్రశ్నించారు.
గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ కుట్రపన్నారని సిట్ అఫిడవిట్‌లో తెలిపింది. పటేల్ కుట్రలో ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ భాగమయ్యారని గుజరాత్ పోలీసులు కూడా తమ అఫిడవిట్‌లో వెల్లడించారు. ప్రస్తుత అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న సెషన్స్ కోర్టు తీస్తా బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com