Manipur Violence: విద్యార్థుల దారుణ హత్యతో వేడెక్కిన మణిపుర్..

Manipur Violence: విద్యార్థుల దారుణ హత్యతో వేడెక్కిన మణిపుర్..
పెల్లుబికిన నిరసనలు, మోడీ పై మండిపడుతున్న విపక్షాలు

మణిపుర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇద్దరు విద్యార్థుల హత్య క్రమంలో మైతెయ్ , కుకీవర్గాలు భారీగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఇంఫాల్ లో మైతేయ్ వర్గానికి చెందిన వేలమంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా, చురాచంద్ పుర్ లో కుకీ మహిళా నేతలు భారీగా నిరసనలు చేపట్టారు. గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆందోళనలు చేశారు. కాగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపుర్ పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వైఖరిని తప్పుబట్టారు. చర్యలెందుకు తీసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో సీఎం బిరేన్ సింగ్ మరోసారి స్పందించారు. ఇద్దరు విద్యార్థుల హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రజలకు హామీనిచ్చారు.

జాతుల మధ్య వైరంతో మణిపుర్​ రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే.. ఇన్ని నెలల నుంచి ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతుంటే.. వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. ఇన్ని రోజుల నుంచి ప్రధానికి ఆ రాష్ట్రంలో పర్యటించాడనికి సమయమే దొరకలేదా అంటూ కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయనకు మణిపుర్‌ను సందర్శించే సమయం లేకపోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.


మణిపూర్‌లో జులై 6న అదృశ్యమై హత్యకు గురయిన వారి మృతదేహాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఇద్దరు విద్యార్థులను కుకీ సాయుధ దుండగులు అపహరించినట్లు ఆగస్టులో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్‌ కో నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న 11 కేసుల్లో ఇది కూడా ఒకటి. ఫోటోలు వైరలైన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌తో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు దుండుగులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్‌ అయ్యింది.

ఈ ఫొటోలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మొయితీ వర్గానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని, 20 ఏళ్ల విద్యార్థిగా గుర్తించినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్‌ ప్రభుత్వం ఆ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story