Rajasthan polls: అధికారంలోకి వస్తే కులగణన,రైతులకు వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర

Rajasthan polls: అధికారంలోకి వస్తే కులగణన,రైతులకు వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర
రాజస్థాన్​లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల

రాజస్థాన్‌లో మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులు, యువత, మహిళలు, ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు పలు హామీలను ఇచ్చింది. వరుసగా ప్రభుత్వ పరీక్షల పేపర్‌ లీక్‌ల నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు 4 లక్షల సర్కారీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీనిచ్చింది.

ఈనెల 25న జరగనున్న రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, సీపీ జోషి .. తదితరులు మంగళవారం పార్టీ ఆఫీస్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు ‘జన ఘోషన పత్ర’గా పేరు పెట్టారు.


రాజస్తాన్ లో మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపింది. స్వామినాధన్ కమిషన్‌ నివేదిక ప్రకారం పంటలను కనీస మద్దతు ధరకు కొనగోలు చేస్తామని పేర్కొంది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకురావడం సహా కులగణన చేపడతామని హామీనిచ్చింది. ఈ ఏడాది చివరి కల్లా రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ 15 లక్షల కోట్లుకు చేరుతుందన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌.....2030 కల్లా దాన్ని 30 లక్షల కోట్లకు చేరుస్తామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వాటిలో 4 లక్షలు ప్రభుత్వం ఉద్యోగాలే ఉంటాయని వెల్లడించారు. గ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకు అందిచడంతో పాటు....ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ను అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందిస్తామని పేర్కొన్నారు. చిరంజీవి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం లబ్ధిదారులకు ఇచ్చే బీమా సొమ్మును 25లక్షల నుంచి 50లక్షలకు పెంచుతామని హామీనిచ్చారు. చిన్న వ్యాపారస్తులకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని వివరించారు. నెరవేర్చగల హామీలనే తాము మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story