Karti Chidambaram: బంగ్లాదేశ్‌ సంక్షోభంపై కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు

Karti Chidambaram: బంగ్లాదేశ్‌ సంక్షోభంపై కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు
X
బంగ్లాదేశ్ ఎఫెక్ట్.. పొరుగు దేశాలపైన ప్రభావం ఉంటుందన్న కాంగ్రెస్ ఎంపీ

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో భారత పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి మన సరిహద్దుల్లోకి శరణార్ధుల ప్రవాహం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భారత ప్రభుత్వం వెనుక అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉంటాయని కార్తీ చిదంబరం చెప్పారు.

హింసాకాండతో బంగ్లాదేశ్‌ అట్టుడికిన నేపథ్యంలో ఆర్మీహెచ్చరికలతో ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేశారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన అనంతరం ఆమె సోదరితో కలిసి ఢాకా ప్యాలెస్‌ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బంగ్లా మీదుగా భారత్‌కు తరలివెళ్లినట్లు స్ధానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాలో కర్ఫూ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. లా అండ్‌ ఆర్డర్‌ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆర్మీ చీఫ్ ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైన్యం మొహరించింది. ఇక బంగ్లాదేశ్‌లో పరిస్ధితి గాడితప్పడంతో పొరుగు దేశాలపై ప్రభావం గురించి హాట్‌ డిబేట్‌ సాగుతున్నది.

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. బంగ్లాలో ప్రస్తుత పరిస్ధితి మన సరిహద్దు భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచిచూడాలని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో భారత పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి మన సరిహద్దుల్లోకి శరణార్ధుల ప్రవాహం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భారత ప్రభుత్వం వెనుక అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉంటాయని కార్తీ చిదంబరం చెప్పారు.

Tags

Next Story