Congress President Elections : కాంగ్రెస్‌లో కింగ్ అయ్యేదెవరంటే..?

Congress President Elections : కాంగ్రెస్‌లో కింగ్ అయ్యేదెవరంటే..?
Congress President Elections : కాంగ్రెస్‌ అధ్యక్ష పోరులో చివరికి ఇద్దరే మిగిలారు. ఓ వైపు మల్లికార్జున ఖర్గే, మరోవైపు శశిథరూర్‌ పోటీపడుతున్నారు

Congress : కాంగ్రెస్‌ అధ్యక్ష పోరులో చివరికి ఇద్దరే మిగిలారు. ఓ వైపు మల్లికార్జున ఖర్గే, మరోవైపు శశిథరూర్‌ పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే.... మల్లికార్జున ఖర్గేకే ఎక్కువగా గెలుపు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.... నేతల మాటలు కూడా పదునెక్కుతున్నాయి.

తాజాగా తనతో తలపడుతున్న శశిథరూర్‌ను తన చిన్న సోదరుడితో పోల్చారు మల్లికార్జున ఖర్గే. పోటీ నుంచి తప్పుకోవాలని తాను ఒత్తిడే చేసేది లేదన్నారు. అయితే.... ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిదని గతంలోనే శశిథరూర్‌కు సూచించించినట్లు తెలిపారు. అయితే... ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదన్నారు ఖర్గే. పార్టీని పటిష్టం చేసేందుకే తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్టు ఖర్గే తెలిపారు.

మరోవైపు ఖర్గేకు మద్దతు వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌. కాంగ్రెస్‌ను బలోపేతం చేసే సామర్థ్యం మల్లికార్జున ఖర్గేకు ఉందన్నారు గెహ్లాట్‌. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారన్నారాయన. పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్‌ను ఉన్నత వర్గానికి' చెందిన వ్యక్తిగా గెహ్లాట్‌ అభివర్ణించారు. థరూర్‌ కూడా మంచి వ్యక్తేనని... ఆయనకూ మంచి ఆలోచనలు ఉన్నా.... ఉత్నత వర్గానికి చెందినవారన్నారు. థరూర్‌ను ఖర్గేతో పోల్చలేమని... అందువల్ల సహజంగానే పోటీ ఖర్గే వైపు ఏకపక్షంగా సాగుతుందన్నారు గెహ్లాట్‌.

అంతకుముందు ప్రసగించిన ఎంపీ శశిథరూర్‌. కాంగ్రెస్‌లోని యువ గళాన్ని వినాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మార్చేందుకు నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. 23 మంది పార్టీ అసమ్మతి నేతల ప్రధాన డిమాండ్‌ను సైతం వింటామన్నారు. సీనియర్లను గౌరవిస్తామని పేర్కొన్నారు. థింక్‌ థరూర్‌ - థింక్‌ టుమారో హ్యాష్‌ట్యాగ్ పేరుతో... మార్పు కోసం తనకు ఓటు వేయాలని కోరుతున్నారు శశిథరూర్‌. మాజీ కేంద్రమంత్రులు మొహిసినా కిద్వాయ్, సైఫుద్దీన్ సోజ్, ఎంపీలు కార్తి చిదంబరం, ప్రద్యుత్ బొర్డోలోయ్, ఎంకే రాఘవన్, మహమ్మద్ జావేద్, తదిదరులు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి .... కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ మాత్రమే మిగిలారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఖర్గే, థరూర్‌, త్రిపాఠి మొత్తం 20 నామినేషన్‌ సెట్లను సమర్పించగా.. ఇందులో ఖర్గే 14, థరూర్‌ 5, త్రిపాఠి ఒక నామినేషన్‌ వేశారు. అయితే, సంతకాల్లో లోపాల కారణంగా నాలుగు పత్రాలను తిరస్కరించినట్లు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ వెల్లడించారు. ఇందులో ఒకటి త్రిపాఠి వేసిన నామినేషన్‌ కూడా ఉంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలిగినట్లయింది. ప్రస్తుతం పోటీలో ఖర్గే, థరూర్‌ ఇద్దరే ఉన్నారని పార్టీ ఎన్నికల సంఘం తెలిపింది.

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే 17న పోలింగ్‌ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు దాదాపు 9వేల మంది ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల్లో ఓట్లు వేస్తారు. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎక్కువ ఓట్లు లభించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story