Assembly Results: మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరాం తప్పించి మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో హస్తం కాస్త పుంజుకున్నప్పటికీ మిగిలిన మూడు రాష్ట్రాల్లో దారుణ ఓటమిని చవి చూసింది. హిందీ బెల్టులో కీలకంగా ఉన్న మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసింది.
చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతున్నది. ఈ నేపథ్యలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజాతీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. మూడు రాష్ట్రాల ఫలితాలు సుపరిపాలన, అభివృద్ధి వైపే ప్రజలు కట్టుబడి ఉన్నట్లు సూచిస్తున్నాయన్నారు. సడలని మద్దతు ఇచ్చిన ఈ రాష్ట్రాల ప్రజలకు థ్యాంక్స్ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయనున్నట్లు చెప్పారు. తీవ్రంగా కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డెవలప్‌మెంట్ ఎజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో కార్యకర్తలు సక్సెస్ అయినట్లు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com