Punjab Election 2022: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..? ప్రకటనపై ప్రజల ఉత్కంఠ..

Punjab Election 2022: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..? ప్రకటనపై ప్రజల ఉత్కంఠ..
Punjab Election 2022: ప్రస్తుతం అందరిచూపు పంజాబ్‌పైనే ఉంది. రేపు కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రకటన ఉండటంతో ఉత్కంఠ నెలకొంది

Punjab Election 2022: ప్రస్తుతం అందరిచూపు పంజాబ్‌పైనే ఉంది. రేపు కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రకటన ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించోతున్నారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్ చన్నీవైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎం సీటుకు ఎసరు పెట్టిన పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ.. భవిష్యత్ కార్యాచరణ ఏవిధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సిద్ధూ పరిస్థితేంటీ?. కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతారా? పార్టీ మారుతారా?. పార్టీ మారితే ఆప్‌లోకి వెళ్తారా? మళ్లీ బీజేపీలోకే వెళ్తిపోతారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన సిద్ధూకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు ఆమ్‌ ఆద్మీ పార్టీతోనూ సిద్ధూ టచ్‌లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో సిద్ధూ భవిష్యత్‌ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.

సీఎం అభ్యర్థిగా చన్నీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిద్ధూ.. అధిష్టానంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చెప్పుచేతల్లో ఉండేవాళ్లను సీఎం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. వాళ్లు ఆడినట్లు ఆడేవాళ్లను సీఎం చేయాలని అగ్రనేతలు ప్రయత్నిస్తుననారంటూ విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా చన్నీపై ఎదురుదాడి చేస్తున్న సిద్ధూ.. సీఎం అభ్యర్థిగా చన్నీ అనర్హుడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story