Congress Song: 'పుష్ప' క్రేజ్ తగ్గేదే లే.. ఏకంగా దేశ రాజకీయాల్లో..

Congress Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప' క్రేజ్ ఇప్పుడే తగ్గేలా లేదు. ఫ్యాన్స్‌తో పాటు స్టార్ క్రికెటర్లు, ప్రముఖులు.. పుష్ప సాంగ్స్, డైలాగ్‌లను అనుకరిస్తూ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకీ 'పుష్ప' ఫీవర్ పాకింది. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసింది. 'పుష్ప' మూవీలోని 'శ్రీవల్లి' సాంగ్ ట్యూన్‌తో యూపీ గొప్పతనాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించింది.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఈమధ్యే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ.. స్పెషల్ వీడియోను విడుదల చేసింది. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ 'హే బేబీ' సినిమాలోని 'మస్త్ కలందర్' పాటను ఫొటో ఎడిట్ చేసి వీడియో చేసింది. ఇది సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉత్తరప్రదేశ్‌లో అదే ఫార్ములాను అవలంభిస్తోంది. నార్త్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ.. శ్రీవల్లి ట్యూన్‌తో ఎన్నికల సాంగ్‌ను రిలీజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com