Maharasthra: మహారాష్ట్ర రాజకీయాలు 'తమాషా' గా ఉన్నాయి: కపిల్ సిబల్

Maharasthra: మహారాష్ట్ర రాజకీయాలు తమాషా గా ఉన్నాయి: కపిల్ సిబల్

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయ పరిణామాలు తమాషాగా అన్పిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అక్కడి రాజకీయాలు ఉన్నాయని అభివర్ణించారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) ముఖ్యనేత, శరద్ పవార్ అల్లుడైన అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చారు. తనకు మద్దతు తెలుపుతున్న ఎంఎల్‌ఏలతో కలిసి అనూహ్యంగా భాజపా-శివసేన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పరిణామాలపై సిబల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. అవి నాకు తమాషాగా అన్పిస్తున్నాయి. మన చట్టం కూడా వీటికి అనుమతిస్తున్నట్లన్పిస్తోంది. అయినా వారు ప్రజల కోసం కాకుండా, పదవుల కోసం పాకులాడుతున్నారని ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం శరద్ పవార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 83 సంవత్రాల శరద్ పవార్ క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడు వైదొలుగుతాడని ప్రశ్నించాడు. తనకు సీఎం కావాలని ఉందనే విషయం కూడా వెల్లడించాడు.


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకోవడానికి తమ బలాలు చూపించుకోవడానికి అజిత్ పవార్, శరద్ పవార్‌ వర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మొత్తం 53 మంది NCP ఎంఎల్‌ఏల్లో 32 మంది అజిత్ పవార్ మీటింగ్‌కి హాజరవ్వగా, 18 ఎంఎల్ఏలు శరద్ పవార్ మీటింగ్‌కి హాజరయ్యారు.


Tags

Read MoreRead Less
Next Story