D.K. SHIVA KUMAR: మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్( D.K. Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర(Conspiracy) జరుగుతోందని ఆరోపించారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనేక సంక్షేమ పథకాలను అమలుపరిస్తూ సరికొత్త ఒరవడితో సిద్ధరామయ్య నేతృత్వంలో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఏం జరుగుతుందో చూద్దామని.. తమ దగ్గర ప్రభుత్వ కూల్చివేత( topple Congress government) కుట్రపై నిర్దిష్టమైన సమాచారం ఉందని శివకుమార్(Deputy Chief Minister D.K. Shivakumar) ఆరోపించారు. బీజేపీ వ్యూహాన్ని బెంగళూరులో కాకుండా బయట ఈ కుట్రలు(strategy) చేస్తున్నారని డీకే శివ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వస్తోన్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీకే ఈ విధంగా స్పందించారు.
డీకే చేసిన వ్యాఖ్యలను కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా సమర్థించారు. బీజేపీ నేతలు ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టారని, అందుకే మనం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాళ్లకు మంచి, చెడు అనే తేడా ఏమీ లేదని, వాళ్లు చేస్తున్న అప్రజాస్వామిక పోకడలు మనకు తెలిసినవేనని విమర్శలు సంధించారు. డీకే శివ కుమార్‌కు దీనిపై మరింత సమాచారం ఉండి ఉండొచ్చని బైరెగౌడ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వాలను కూల్చడంలో ఎంతో ప్రసిద్ధి పొందిందన్నారు.
కర్ణాటకలో రెండు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో ఆ హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వేరే పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు దాదాపు 43 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీకి దాదాపు 36 శాతం, 13 శాతం ఓట్లు జేడీఎస్ ఖాతాలోకి వెళ్లాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com