బ్రిజ్ భూషణ్ వేధింపులకు ఆధారాలున్నాయా ..

బ్రిజ్ భూషణ్ వేధింపులకు ఆధారాలున్నాయా ..
ఆరోపణలకు మద్ధతుగా ఫోటోలు , వీడియోలు కోరిన పోలీసులు

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు పై పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లు తమ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు ఉంటే చూపించాల్సిందిగా కోరారు.

WFI చీఫ్‌ బ్రిజ్ భూషణ్ తమను చాలా సార్లు బలవంతంగా హగ్‌ చేసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని వివిధరకాలుగా ఆరోపణలు చేశారు రెజ్లర్లు. ఇప్పుడు వీటన్నింటికి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించారు పోలీసులు. CRPC సెక్షన్ 91 కింద ఈ రెజ్లర్లకు నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ ప్రకారం కేసు విచారణకు అవసరమైన ఎలాంటి పత్రాలనైనా దర్యాప్తు అధికారులు కోరవచ్చు. అందుకే బ్రిజ్ భూషణ్ బెదిరింపు కాల్స్ కూడా చేశారన్న ఆరోపణలకూ ఆధారాలు అడిగారు. ఫోన్ లాగ్ , కాల్‌ రికార్డింగ్‌లు, వాట్సాప్‌ చాట్‌లు ఏమైనా ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా సొంతంగా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రెజ్లర్లు మాత్రం ఢిల్లీ పోలీసుల తీరుని తప్పుపడుతున్నారు. కావాలనే కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. తమ స్టేట్‌మెంట్‌లు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా బజరంగ్ పూనియా మాట్లాడుతూ బ్రిడ్జ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పోలీసుల దర్యాప్తును తాము విశ్వసించడం లేదని బిజెపి ఎంపీ ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బ్రిడ్జిభూషణ్ సింగ్ అక్కడ ఉన్నప్పటికీ పోలీసులు నిన్న ఒక మహిళా రెజ్లర్ ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తీసుకువెళ్లడాన్ని తప్పుపట్టారు. మరోవైపు సింగ్ రెజ్లర్ లను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. లైంగిక వేధింపులు జరిపిన సమయంలో తను మైనర్ని అని స్టేట్మెంట్ ఇచ్చిన బాలిక ఇప్పుడు మైనర్ కాదు మేజర్ అని చెప్పటం సంచలనం రేపింది. విచారణను నిర్వీర్యం చేయడానికి ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించడానికి బ్రిడ్జ్ భూషణ్ కు చాలా అవకాశాలు ఉన్నాయని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story