Corbevax vaccine: దేశంలో 12-18 ఏళ్ల వారికి కొత్త కోవిడ్ వ్యాక్సిన్..

Corbevax vaccine: దేశంలో 12-18 ఏళ్ల వారికి కొత్త కోవిడ్ వ్యాక్సిన్..
Corbevax vaccine: దేశంలోని పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది.

Corbevax vaccine: దేశంలోని పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్‌-ఇ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు పొందింది.

దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి ఈ టీకా వేస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 5-18 వయసు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి రెండో, మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో బయోలాజికల్‌-ఇ సంస్థకు అనుమతి లభించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో, మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు బయోలాజికల్‌-ఇ సంస్థ పేర్కొంది. కొవాగ్జిన్‌ తరహాలోనే కోర్బెవాక్స్‌ను రెండు డోసుల్లో ఈ టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story