Corona India : ఆందోళన కలిగిస్తున్న పాజిటివిటీ రేటు.. 24 గంటల్లో 67 మంది మృతి..

Corona India : ఆందోళన కలిగిస్తున్న పాజిటివిటీ రేటు.. 24 గంటల్లో 67 మంది మృతి..
X
Corona India : దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది.

Corona India : దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21 వేల 411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్‌ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20 వేల 726 మంది కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం లక్షా 50 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Next Story