కోపంతో కౌగలించుకొని భార్యను కాల్చిన భర్త, ఒకే తూటాకు ఇద్దరూ మృతి

కోపంతో కౌగలించుకొని భార్యను కాల్చిన భర్త, ఒకే తూటాకు ఇద్దరూ మృతి
X
నాటు తుపాకీ తో కాల్చిన భర్త, అనాధలైన పిల్లలు

అదుపు లేని కోపం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్యమీద కోపంతో కౌగాలించుకొని నాటు తుపాకీ తో కాల్చిన భర్త, ఆమె ప్రాణాలు తియ్యడంతో పాటుగా తనూ ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాదులో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే. బిలారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్పూర్ గ్రామంలో పాల్ అనే వ్యక్తి కుటుంబంతో జీవిస్తున్నాడు. అతను దినసరి కూలీ. పాల్ కు పెళ్లయింది.

భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం భార్య సుమన్ తన దగ్గర ఉన్న ఫోన్ ను పోగొట్టింది. ఈ విషయం మీదే ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నా కూడా పాల్ ఈ విషయాన్ని వదిలేయలేకపోయాడు. పదే పదే ఫోన్ విషయం లో వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో మంగళవారం తీవ్రమైన కోపానికి గురైన పాల్ సహనం కోల్పోయి భార్య కదలకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తన నాటు తుపాకీతో ఆమె వీపు మీద కాల్చాడు. అయితే ఆ బుల్లెట్ ఆమె ఛాతి నుంచి బయటికి దూసుకు వచ్చి, ఆమెను కౌగిలించుకున్న పాల్ కు తగిలింది.

దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కాల్పుల శబ్దం విన్న చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ పాల్ ఇంటికి వచ్చారు. భార్యాభర్తలిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు వారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో నలుగురు పిల్లలు అనాధలుగా మారారు. చిన్నారులను పోలీసులు సంరక్షణ ఆలయానికి తరలించారు.

Tags

Next Story