Rajasthan: సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన భర్తపైనే పోటీకి దిగిన భార్య..

Rajasthan:  సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన భర్తపైనే పోటీకి దిగిన భార్య..
ఒకే ఇంట్లో నుంచి బ‌రిలో దిగ‌నున్న భార్య భ‌ర్త‌లు...

రాజస్థాన్ ఎన్నికల సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందుకంటే ఇక్కడ ఒక మహిళ ఏకంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. ఆ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో ఇద్దరు భార్యభర్తులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నారు. జేజేపీ నుంచి రీటా చౌదరి పోటీ చేస్తుండగా.. ఆమె భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే వరిందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, ఈ కుటుంబానికి కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వరీందర్ సింగ్ తండ్రి నారాయణ్ సింగ్ 7 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. వరీందర్ సింగ్ భార్య రీటా చౌదరి ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు. ఆ తర్వాత పార్టీ ఆమెను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.


రీటా చౌదరి అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు కానీ, కాంగ్రెస్ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు ఆమె భర్తకు ఇచ్చింది. దీంతో ఆమె జేజేపీ పార్టీలో జాయిన్ అయింది. ఇక, JJP తన అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది.. ఇందులో దంతా రామ్‌గఢ్ నుంచి రీటా చౌదరి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రీటా చౌదరి మాట్లాడుతూ తన మనస్సాక్షి చెప్పిన విధంగానే నడుచుకుంటానని, అందుకే జేజేపీ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని, ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story