Viral video : వైరల్ అయిన వృద్ధ జంట వీడియో

Viral video : వైరల్ అయిన వృద్ధ జంట వీడియో
‘రిమ్‌జిమ్ గిరే సావన్ 'పాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రిక్రీయేట్ చేసిన ఓల్డ్ కపుల్

నచ్చిన ప్లేస్ లో సెల్ఫీలు దిగడం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్. రీల్స్ చేయడం లేటెస్ట్.. కానీ ఓల్డ్ అయినా ఒక జంట ఒక ఓల్డ్ సాంగ్ ని రీ క్రియేట్ చేశారు. అదే ఇప్పుడు లేటెస్ట్ వైరల్ వీడియో..

ముంబయిలో భారీగా వర్షాలు పడుతున్నా రీల్స్, వీడియోలు చేసేవారు ఏ మాత్రం తగ్గట్లేదు. పిల్లలు పెద్దవాళ్లు అందరూ ఆ వర్షాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా తాజాగా ఓ వృద్ధ జంట మంజిల్ సినిమాలోని వాన పాటను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. 1979 లో వచ్చిన మంజిల్ సినిమాలోని ‘రిమ్‌జిమ్ గిరే సావన్’ పాటపై వీడియో చిత్రీకరించారు. అమితాబ్ బచ్చన్, మౌసమి ఛటర్జీలపై చిత్రీకరించబడిన ఈ వానపాటలో నటించి వృద్ధ జంట అలరించారు. ఎంత ప్రాక్టీస్ చేశారో ఏమోగానీ పాటలో సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. అదే దుస్తులు వేసుకుని చేతిలో చేయి వేసుకొని ఆనందంగా బీచ్ అంతా కలయ తిరిగారు. అరుణ్ పనికర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన జంట శైలేష్ ఇనామ్ దార్, భార్య వందన. కాగా వీడియోను వారి స్నేహితులు అనూప్ రింగంగావ్కర్ ఆయన భార్య అంకిత షూట్ చేశారట. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర ఆనాటి బిగ్‌బీ పాటకు అదే లొకేషన్స్‌లో వృద్ధ జంట సరైన స్టెప్పులు వేశారంటూ అభినందించారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా నేచురల్‌గా వీడియో తీశారు. సాధారణమైన జీవితాన్ని పాటలో చక్కగా చూపించారంటూ ఒకరు, ’ఇది నా ఫేవరెట్ పాత బాంబే మాన్‌సూన్ సాంగ్’ అంటూ మరొకరు, మనలోని చిన్నపిల్లల తత్వాన్ని గుర్తు చేశారని వేరొకరు ఇలా రకరకాలుగా మరొకరు కామెంట్ లు పెడుతున్నారు. మొత్తానికి యూత్ మాత్రమే కాదు మేం కూడా ట్రెండ్ క్రియేట్ చేయగలమని ఈ ఓల్డ్ కపుల్ చూపించారు.

Tags

Read MoreRead Less
Next Story