భరణం ఇచ్చి బాధ పెట్టాలనుకున్న భర్త.. షాక్ ఇచ్చిన కోర్టు

భరణం ఇచ్చి బాధ పెట్టాలనుకున్న భర్త.. షాక్ ఇచ్చిన కోర్టు
కొంతమంది ఎదుటివారిని బాధ పెట్టడం తమ హక్కుగా సాధిస్తారు. అందులోనూ ఇంటికి వచ్చిన కోడల్ని హెరాష్ చేయడం ఇష్టంగా ఫీల్ అవుతారు.

కొంతమంది ఎదుటివారిని బాధ పెట్టడం తమ హక్కుగా సాధిస్తారు. అందులోనూ ఇంటికి వచ్చిన కోడల్ని హెరాష్ చేయడం ఇష్టంగా ఫీల్ అవుతారు. అలాగే భావించారు ఒక యువతి అత్తింటివారు. విడాకులు అడిగిన అమ్మాయిని మానసికంగా ఆందోళన పడేలా చేయడం కోసం భరణంగా ఇవ్వాల్సిన డబ్బంతా నాణాల రూపంలో ఇద్దామని ప్లాన్ చేసుకున్నారు.అటు కోర్టు కూడా నాణాలు కూడా డబ్బే కదా అంటూ భరణాన్ని అంగీకరించింది. కానీ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. భర్తే ఆ డబ్బంతా చక్కగా లెక్క పెట్టి, ప్రతి వెయ్యి రూపాయలు ఒక ప్యాకెట్గా చేసి ఇవ్వాల్సిందిగా తీర్పు ఇచ్చింది.

జైపూర్ కోర్టులో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. దశరథ్ కుమావత్ 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. . కొన్నాళ్ల తర్వాత సీమా తన భర్తపై వరకట్నం కేసు పెట్టింది. గత ఐదేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. వాదోపవాదాలు విన్నకోర్టు భార్యకు జీవనభృతి కింద రూ.2.25 లక్షలు చెల్లించాలంటూ దశరథ్ ను ఆదేశించింది. అంటే నెలకు 5000. అయితే 11 నెలలుగా దసరథ్ ఒక్క రూపాయి కూడా సీమకు చెల్లించలేదు. కోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టడంతో అతడిని ఈ నెల 17 న జైల్లో వేశారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కలవరపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సిన జీవనభృతిని చెల్లించాలని నిర్ణయించారు. ఏకంగాఏడు బస్తాలు మోసుకుంటూ కోర్టుకు వచ్చారు. వాటి బరువు సుమారు 280 కేజీలు. ఇవన్నీ సీమ కు భరణం కింద ఇవ్వాల్సిన డబ్బులేనని చెప్పారు. బస్తాలు తెరిచి చూస్తే అందులో ఉన్నవన్నీ రూపాయి, రెండు రూపాయల నాణాలు మాత్రమే. దీనిపై సీమా న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింటుకు చెల్లించాల్సిన జీవనభృతిని ఇలా నాణేల రూపంలో తీసుకురావడం కచ్చితంగా కక్షసాధింపు చర్య కిందకే వస్తుందని వాదించారు. అటు జడ్జి కూడా ఈ నాణేల మూటలు చూసి విస్మయం చెందారు. కానీ వెంటనే భరణంగా ఆ డబ్బు అంగీకరించవచ్చు అంటూ తీర్పు చెప్పారు. అయితే అక్కడే అతను మరింత తెలివిగా వ్యవహరించారు.

జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను రూ.1000 చొప్పున బ్యాగుల్లో ఉంచి, సులువుగా లెక్కపెట్టేందుకు వీలుగా కోర్టుకు అందించాలని, జూన్ 26 లోగా ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో భర్త కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయాయి. కుటుంబం నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా సీమని బాధ పెట్టాలనుకొని వారు వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో ఎక్కడలేని బాధ వచ్చి పడింది. చేసేదేం లేక వారే ఆ డబ్బును దశరథ్ ఉన్న పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంటికి వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story