ICMR Study on Covid: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమే కాదు

ICMR Study on Covid: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమే కాదు
ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

దేశంలో యువత ఆకస్మిక మరణాలకు కొవిడ్‌ టీకా కారణం కాదని....భారత వైద్య పరిశోధన మండలి-ICMR వెల్లడించింది. కనీసం కరోనా టీకా ఒక డోసు తీసుకున్నా.... ఆకస్మిక మరణం ముప్పును తగ్గిస్తుందని పేర్కొంది. ఐసీఎంఆర్‌ అధ్యయన నివేదికను.... ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రచురించింది. యువతలో ఆకస్మిక మరణాల ముప్పును....కొవిడ్‌ టీకా పెంచదని ICMR వివరించింది. 2021అక్టోబర్‌ నుంచి 2023 మార్చి వరకు ఆకస్మికంగా మరణించిన 18నుంచి 45ఏళ్ల వయసు వ్యక్తులపై.... ICMR అధ్యయనం చేసింది. కరోనా టీకా 2 డోసులు తీసుకున్నవారిలో.... ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్లు ICMR తెలిపింది. కనీసం టీకా ఒక డోసు తీసుకున్నా.... ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ICMR పేర్కొంది

భారతీయ యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కొవిడ్​ టీకాలు పెంచాయన్న వాదనలు సరికావని ఐసీఎంఆర్​ వెల్లడించింది. పోస్ట్​ కొవిడ్​ హాస్పిటలైజేషన్​, లైఫ్​స్టైల్​, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, అప్పటివరకు వెలుగులోకి రాని అనారోగాలు వంటివి కారణమని వివరించింది. దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో పరిశోధనలు చేసి ఓ అధ్యయనాన్ని రూపొందించింది ఐసీఎంఆర్​. ఈ క్రమంలో.. 2021 అక్టోబర్​- 2023 మార్చ్​ మధ్య కాలంలో.. ఆకస్మికంగా మరణించిన 18-45ఏళ్ల వయస్కుల వారి హెల్త్​ హిస్టరీని కూడా పరిశీలించింది. వారి కొడివ్​ వ్యాక్సినేషన్​, కొవిడ్​ అనంతర పరిస్థితులు, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, స్మోకింగ్​, డ్రగ్స్​ అలవాట్లు (మరణానికి 48గంటల ముందు వరకు) వంటి అంశాలపై డేటాను సేకరించింది.కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సహఅనుబంధ వ్యాధులు లేదా అకస్మాత్తుగా మృత్యువాతపడడాన్ని తాము గుర్తించలేదని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు.


729 కేసులు, 2,916 పర్యవేక్షణలను పరిశీలించగా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అకస్మాత్తు మరణాల రిస్క్ తక్కువగా ఉన్నట్టు బయటపడిందని తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ రిస్క్ మరింత తక్కువగా ఉందని వివరించింది. అయితే సింగిల్ డోసు ఈ స్థాయిలో రక్షణ ఇవ్వలేదనికొవిడ్​ అనంతరం దేశంలో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని, వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారన్న నివేదికలను దృష్టిలో పెట్టుకుని.. ఈ స్టడీని నిర్వహించింది ఐసీఎంఆర్​.

"కొవిడ్​ తీవ్రతను తగ్గించేందుకు టీకాలు ఉపయోగపడ్డాయి. రెండు టీకాలు తీసుకన్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదం ఎక్కువగా కనిపించలేదు. ఒక డోసు తీసుకుంటే.. ఆకస్మిక మరణానికి కారణ అవ్వొచ్చు. ఇది కొవిడ్​ సంబంధిత సమస్య వల్ల కావొచ్చు," అని ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. .

Tags

Read MoreRead Less
Next Story