సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత..

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) గురువారం (సెప్టెంబర్ 12) కన్నుమూశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి 2015లో ప్రకాశ్ కారత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
72 ఏళ్ల నేత ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ఐసియులో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారని సిపిఎం మంగళవారం (సెప్టెంబర్ 10) ఒక ప్రకటనలో తెలిపింది. న్యుమోనియా లాంటి ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు.
ఏచూరి తన విద్యార్థి రోజుల నుండి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. చాలా కాలం పాటు దేశంలో వామపక్ష రాజకీయాలకు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్ సభ సభ్యుడు అయిన రాహుల్ గాంధీ ఏచూరికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన "ఒక స్నేహితుడు", "మన దేశం గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com