UP teacher: టీచరమ్మా... ఇదేం పని

విద్యార్థులందరినీ సమానంగా చూడాల్సిన ఉపాధ్యాయురాలు(UP teacher), వారి మధ్య మత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఒక వర్గానికి చెందిన పిల్లల(slap Muslim boy)ను కొట్టాలంటూ మరో వర్గానికి చెందిన పిల్లలను ప్రోత్సహించింది. ఒక విద్యార్థిని మరికొందరితో కొట్టించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్(UP’s Muzaffarnagar )లో మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థి పట్ల ఒక ఉపాధ్యాయురాలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హోంవర్క్ చేయనందుకు ఖుబ్బాపూర్ గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి బాలుడిని కొట్టమని ఇతర విద్యార్థులను ఉపాధ్యాయురాలు సూచించారు(encouraging students ). అంతేకాకుండా బాలుడి మతంపైనా అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. ఈ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. అమాయక పిల్లల మనస్సులలో వివక్ష అనే విషాన్ని నాటడం సరికాదన్నారు. పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని ఒక టీచర్ విద్వేషాల మార్కెట్ గా మార్చడం కంటే దారుణమైన పని మరొకటి ఉండదని ఎక్స్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. పిల్లలు దేశ భవిష్యత్తు అని పేర్కొన్న రాహుల్ వారికి అంతా కలిసి ప్రేమను నేర్పించాలని సూచించారు. చంద్రుడిపైకి వెళ్లే సాంకేతికత గురించి చర్చించాలో లేక ద్వేషానికి సరిహద్దు గోడను నిర్మించడంపై చర్చ జరగాలో నిర్ణయించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com