CROCODILE ATTACK: అయ్యో పాపం.. బాలుడిని మింగేసిన భారీ మొసలి..!

CROCODILE ATTACK: అయ్యో పాపం.. బాలుడిని మింగేసిన భారీ మొసలి..!
CROCODILE ATTACK: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది.గ్రామస్తులు కాపాడాలని చూసినా ఫలితం దక్కలేదు.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది. చంబల్ నదిలో స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. నదిలో ఉన్న మెసలిని కర్రలు, తాడు, వల సాయంతో బయటకు లాగారు. మొసలిని చంపి బాలుడిని రక్షించాలని గ్రామస్తులు భావించారు. అయితే సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్ష విభాగం బృందం, పోలీసులు గ్రామస్తుల బారి నుంచి మొసలిని విడిపించేందుకు ప్రయత్నించారు.

అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో తమ బిడ్డ బతికే ఉంటుందని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి తమ బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని పోలీసులకు తెగేసి చెప్పారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్ష విభాగం బాలుడి కుటుంబ సభ్యులను ఒప్పించడంతో గ్రామస్తులు మొసలిని విడిచిపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story