Bihar: మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..

Bihar: మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
బీహార్‌లో అమానుష ఘటన..

బీహార్‌ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు. ఈ దుశ్చర్య శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.

దేశంలో దళితులపై వివక్ష, దాడులు, హత్యలు, అవమానాలు నేటికీ కొనసాగుతూనేవున్నాయి. తాజాగా బీహార్ లోని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు దుండగులు. తీసుకొన్న పదిహేను వందల అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు వేధించినట్లు ఓ మహిళ ఆరోపించింది.

అంతటితో తనను వివస్త్రను చేసి, కర్రలతో దాడిచేశారని బాధితురాలు ఆరోపించింది. బలవంతంగా మూత్రం తాగించారని తెలిపింది. ప్రస్తుతం గాయాలతో బాధిత మహిళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పాట్నా జిల్లా ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషయంగా ఉన్నదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్‌ సింగ్‌, అన్షు తండ్రి కుమారులని పోలీసులు పేర్కొన్నారు. వీరు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధిత మహిళ ఇంటికెళ్లి, ఆమెను బలవంతంగా వారి ఇంటికి తీసుకొచ్చారని వివరించారు. నిందితుల నుంచి మహిళ ఎలాగొలా తప్పించుకొని ఇంటికి చేరిందని, ప్రస్తుతం ఇద్దరు నిందితుతు పరారీలో ఉన్నారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story