కూతురి మతాంతర వివాహం.. నచ్చని తల్లిదండ్రులు ఆమెకు పిండ ప్రధానం

సమాజంలో ఎన్నో మార్పులు.. కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. కులం, తం అడ్డుగోడలు చెరిపేస్తున్నారు అని సంతోషించేలోపే ఎక్కడో ఒక చోట కొందరు వాటినే పట్టుకుని వేళ్లాడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమకు కులం, మతం అడ్డురాదని తెలిసి ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకునే టైమ్ కి అమ్మాయి అమ్మానాన్నలు అస్సల అంగీకరించలేకపోయారు. కూతురు వేరే మతంకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసి బతికుండగానే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి పిండ ప్రధానం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని జల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు అనామిక దూబే ముస్లిం యువకుడు మహ్మద్ అయాజ్‌ను వివాహం చేసుకుంది. కూతురు మతం మారి పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు మతాంతర వివాహం చేసుకుని తమకు తలవంపులు తెచ్చిందని భావించారు. బతికుండగానే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. జూన్ 11, 2023 అనామికకు పిండ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆమె కుటుంబ సభ్యులు కార్డ్‌లను కూడా ముద్రించి ఊరంతా పంచారు.
కుటుంబ సభ్యులతో పాటు హిందూ సంస్థలు వివాహాన్ని ఆపాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశాయి. అయితే అప్పటికే ఇద్దరూ కోర్టులో కోర్టు వివాహం చేసుకున్నారు. జూన్ 7న వీరి వివాహం జరిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com