Raus IAS Study Circle: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు

Raus IAS Study Circle: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనతో  అలర్ట్ అయిన అధికారులు
X
రాజధానిలో అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లకు సీజ్‌

ఢిల్లీ రాజిందర్‌నగర్‌‌లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులను బలితీసుకున్న తర్వాత అధికారులు కళ్లు తెరిచారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. నిన్న పలు కోచింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించి, నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల భరతం పట్టారు. స్టోర్ రూమ్‌గా, పార్కింగ్ ఏరియాగా వాడుకోవాల్సిన సెల్లార్‌ను కమర్షియల్‌గా ఉపయోగించుకుంటున్నట్టు అధికారులు గుర్తించినట్టు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు. రాజిందర్‌నగర్‌లోని అన్ని కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్టు వివరించారు. అవసరం అనుకుంటే ఢిల్లీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తిన ఘటనలో మంచిర్యాల అమ్మాయి తానియా సోని (25)తోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నవీన్ దల్వైన్ (29) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Tags

Next Story