Deepti: కాంస్య పతక విజేత దీప్తి కి శంషాబాద్‌లో ఘన స్వాగతం
పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజికి స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. పారిస్ నుండి పతకంతో ఇవాళ (సెప్టెంబర్ 6) హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న దీప్తికి కుటుంబ సభ్యులు, అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్టు నుండి కొంత దూరం విజయోత్సవ ర్యాలీ తీశారు. అక్కడి నేరుగా హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకుంది దీప్తి. అకాడమీలో దీప్తి దీప్తికి సన్మానం చేశారు . ఈ కార్యక్రమంలో పుల్లెల గోపిచంద్, దీప్తి కోచ్ నాగపూరి రమేష్, స్టేట్ స్పోర్ట్స్ ఆథారిటీ ఛైర్మెన్ శివసేన రెడ్డి పాల్గొని దీప్తిని అభింనందించారు.
వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్‌లో 55.82 సెకన్లలో రేస్‌ని కంప్లీట్ చేసి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్‌లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‍గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనిక ముందు జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోను 400ల మీటర్ల పరుగు పందెంని 55.07 సెకన్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా, చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి.. ఖమ్మం డిస్ట్రిక్ అథ్లెటిక్ మీట్లో కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది. దీప్తి అద్భుత టాలెంట్ ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరబాద్కి తీసుకొచ్చారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. హైదరాబాద్ లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్ లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మోరు మోగిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com