Indian Navy: 84,560 కోట్లతో ఆయుధ వ్యవస్థల కొనుగోళ్ళు

Indian Navy: 84,560 కోట్లతో ఆయుధ వ్యవస్థల కొనుగోళ్ళు
X
ఆత్మ నిర్బర్‌ భారత్‌ లక్ష్యం దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం

రక్షణ దళాల సామర్థ్యం, యుద్ధ పాటవాలను మెరుగుపర్చటంతోపాటు ఆత్మ నిర్బర్‌ భారత్‌ లక్ష్యం దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 84వేల 560 కోట్ల విలువచేసే అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు...రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. కొత్తతరం యాంటీ ట్యాంక్‌ మైన్లు, గగనతలంలో ఇంధనం నింపే విమానాలు, నీటి అడుగున ఉండే లక్ష్యాలను గుర్తించి దాడిచేసే టార్పెడోలు...తాజాప్రతిపాదనల్లో ఉన్నాయి. అయితే...కేంద్ర కేబినెట్‌ కమిటీ తుది ఆమోదం తెలపటమే తరువాయి అని తెలుస్తోంది.

త్రివిధ దళాల సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా...రక్షణ కోనుగోళ్ల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 84వేల 5వందల 60కోట్ల విలువ చేసే అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థల కొనుగోళ్లకు...ఆమోదం తెలిపింది. కొత్తరకం యాంటీ ట్యాంక్‌ మైన్స్‌, నౌకాదళానికి ఉపయోగపడే టార్పెడోలు, బహుళ ఆపరేషన్లకు ఉపయుక్తంగా ఉండే సముద్ర విమానాలు, వైమానిక దళానికి ఉపయోగపడే వ్యూహాత్మక నియంత్రణ రాడార్ల కొనుగోలుకు...రక్షణ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ కమిటీ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఈ నిర్ణయం సైనిక, తీరప్రాంత గస్తీ దళాల సామర్థ్యాలను, యుద్ధ పాటవాన్ని బలోపేతం చేయనుంది.


ఆత్మనిర్బర్‌ భారత్‌ అనే కేంద్రప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ విక్రేతల నుంచి...అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను కొనుగోలు చేసే విధంగా రూపొందించిన చాలా ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. మందుపాతర్లను...భూకంప సెన్సార్లు, రిమోట్‌తో నిర్వీర్యం చేసే సామర్థ్యం కలిగిన కొత్తతరం యాంటీ ట్యాంక్‌లతోపాటు విభిన్నశ్రేణి అత్యాధునిక సాంకేతికతలు రక్షణ శాఖ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉన్నాయి. యంత్రాలతో కూడిన దళాల సామర్థ్యాలను పెంపొందించడం కోసం, ఒక డబ్బా ద్వారా ప్రయోగించే యాంటీ-ఆర్మర్ లోయిటర్ మ్యూనిషన్ సిస్టమ్ కొనుగోలుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. యుద్ధప్రాంతంలో దృష్టి రేఖను మించిన లక్ష్యాలపై గురిపెట్టేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు.

వాయుసేన రక్షణ వ్యవస్థలో భాగమైన నూతన వ్యూహాత్మక నియంత్రణ రాడార్లు...నెమ్మదిగా, తక్కువఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నౌకాదళం, తీరప్రాంత గస్తీ దళాల నిఘా సామర్థ్యాలను పెంచే మధ్యశ్రేణి నిఘా, బహుళ ఆపరేషన్లకు ఉపయోగపడే విమానాలను కొనుగోలు చేయనున్నారు. నీటి అడుగున ఉండే లక్ష్యాలను గుర్తించి, నిర్వీర్యం చేసే... యాక్టివ్ టోవ్డ్ అర్రే సోనార్, టార్పెడోలను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. అవి నౌకాదళం ఆస్తులను ప్రత్యేకంగా కల్వరి శ్రేణి జలాంతర్గాములు...లక్ష్యాలను గుర్తించి, దాడి చేసే సామార్థ్యాన్ని మెరుగుపర్చనున్నాయి.

గగనతలంలో ఇంధనం నింపే యుద్ధ విమానాల సేకరణకు...రక్షణ కొనుగోళ్ల మండలి పచ్చజెండా ఊపింది. ఇవి... వైమానిక దళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచనున్నాయి. తీరప్రాంత గస్తీ దళం కూడా కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన రేడియోలను పొందనుంది

Tags

Next Story