Delhi Pollution: ఢిల్లీలో వాయుకాలుష్యం.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం సంచలన సలహా ఇచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యం గాలి నాణ్యత సూచిక ప్రకారం 468కి పడిపోయింది. వాయు కాలుష్యం తీవ్రతతో పొగమంచు ప్రభావం వల్ల వాహనచోదకులకు దారి కూడా సరిగా కనిపించడం లేదు. కాలుష్యం ఎఫెక్ట్ వల్ల ఢిల్లీ వాసులు ఇళ్లలోపలే ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సలహా ఇచ్చారు.
తగ్గుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాలుష్య కారకాలను తీసుకువస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా వాయు కాలుష్య సంక్షోభంపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాలుష్య ఉద్గారాలను నియంత్రించడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ‘‘ ప్రజలు వీలైనంత వరకు ఇంటి లోపల ఉండాలి, అనవసరమైన ప్రయాణాన్ని నివారించాలి, అవసరమైతే ప్రజా రవాణాను ఉపయోగించాలని, తద్వారా తక్కువ ట్రాఫిక్ ఉండేలా చూసుకొని, ధూళి కాలుష్యాన్ని తగ్గించాలి’’ అని గవర్నర్ సక్సేనా సలహా ఇచ్చారు. ఇప్పటికే నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల ఎంట్రీపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో తక్షణమే జీఆర్ఏపీ షెడ్యూల్‌ను అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయుకాలుష్యం కారణంగానే సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే టైంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది.
దేశ రాజధానిలో డబుల్ షిఫ్ట్‌లలో వాటర్ స్ప్రింక్లర్లు, యాంటీ స్మోగ్ గన్‌లను ఉపయోగించాలని గవర్నర్ ఆదేశించారు. కాలుష్యం కాటు ఢిల్లీ వాసుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. వాయు కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజల ఏకాగ్రత, ఉత్పాదకత దెబ్బతింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ గుర్గావ్, ఎన్‌సిఆర్‌లోని ఇతర ప్రాంతాలలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com