
ఏకంగా ఒక మంత్రి.. ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలో అచ్చంగా ఇదే జరిగింది. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కాళ్లపై పడ్డారు. ఎమ్మెల్యే కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. మార్షల్స్ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లాలని కోరారు. వెంటనే మంత్రి తన కాళ్లమీద పడటంతో, ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కారులోనే మంత్రి భరద్వాజ్, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లారు. ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్‌ను పునరుద్ధరించాలంటూ ఆమ్‌ఆద్మీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్యాసింబర్ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం – సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అనే వ్యవస్థను రూపొందించింది. ఒక్కో బస్సులో ఒక్కో మార్షల్ ఉంటారు. ఇలా 10వేల మంది మార్షల్స్ అందుబాటులో ఉన్నారు. అయితే, ఆర్థిక భారం అవుతోందంటూ LG ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపైనే రోజుకోరకంగా ఆమ్‌ఆద్మీ ఆందోళన చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com