Arvind Kejriwal: జైలు నుంచే ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌..

Arvind Kejriwal: జైలు నుంచే  ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌..
జల మంత్రిత్వ శాఖకు సంబంధించి తొలి ఉత్తర్వు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు. జల మంత్రిత్వ శాఖకు నోట్‌ ద్వారా ఆదేశించారని పార్టీ వర్గాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి ఆదివారం నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

కాగా, లిక్కర్‌ పాలసీ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు మార్చి 29 వరకు కస్టడీ విధించింది. అయితే కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటి నుంచి అవసరమైతే తమ నాయకుడు జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్‌ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ఇప్పటికే చెప్పామని మంత్రి అతిశి అన్నారు. జైలు నుంచి పాలన సాగించడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయన దోషిగా నిర్ధారణ కాలేదని, అందువల్ల ఆయన ఢిల్లీ సీఎంగానే కొనసాగుతారని చెప్పారు.

ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను వెంటనే విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ ను మార్చి 27న విచారించనుంది. ఈ పిటీషన్ లో.. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. బెయిల్ పొందేందుకు చట్టపరంగా తనకు అర్హత ఉందని కేజ్రీవాల్ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన తొలి ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉత్తర్వులను జల మంత్రికి నోట్ ద్వారా జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో జల మంత్రిత్వ శాఖ అతిశి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించవచ్చునని తెలుస్తోంది. మరోవైపు రెండోరోజు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కొనసాగుతుంది. తొలిరోజు ఈడీ విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కే్జ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story