New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత
కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రతను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రతకు అర్హులు. జెడ్ కేటగిరీ భద్రత కోసం 22 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఉంటారు. జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.
ఢిల్లీలో అసంఘటిత రంగ కార్మికుల వేతానాన్ని పెంచుతూ అతిశీ ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త వేతనం ధరలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అతిశీ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం రూ.18,066, మధ్యస్త నైపుణ్యం కలిగిన వారి వేతనం రూ.19,929, మెరుగైన నైపుణ్యం కలిగిన వారి వేతనం రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఆమె బాధ్యతలు చేపడుతూ కేజ్రీవాల్ కుర్చీని పక్కన పెట్టి మరొక చైర్‌లో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఆరు నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవలే విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషికి బాధ్యతలు అప్పగించారు. ఇలా అతిషికి అదృష్టం దక్కింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com