Delhi shopping Festival: అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్.. కస్టమర్లకు డిస్కౌంట్ల పండగ

Delhi shopping Festival: అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్.. కస్టమర్లకు డిస్కౌంట్ల పండగ
Delhi shopping Festival: ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్.. ప్రయోగాలు చేయడంలో ముందుంటారు

Delhi shopping Festival: ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్.. ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. తాజాగా ఢిళ్లీ షాపింగ్ ఫెస్టివల్ 2023లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనుందని ప్రకటించారు. 30 రోజులు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్ కు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆ 30 రోజుల్లో ఢిళ్లీ వీధులు కలకలలాడేలా చేస్తామన్నారు.

ఈ ఫెస్టివల్ లో కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఉంటాయన్నారు. ఈ ఫెస్టివల్‌తో ఢిల్లీ ఆర్థికంగా పుంజుకోవడం మాత్రమే కాదు, వేల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలో తమకు నచ్చిన వస్తువు అందుబాటులోకి వస్తుందన్నారు.

రానున్న రోజుల్లో ఈ ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్ ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి ప్రజల్ని ఆహ్వానించబోతున్నట్లు కూడా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story