Delhi: తమ్ముడు కావాలన్న కుమార్తె.. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే

Delhi:  తమ్ముడు కావాలన్న కుమార్తె.. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే
బాలుడిని కిడ్నాప్, అరెస్ట్

రాఖీ పండగ దగ్గరికి వస్తోంది. ఆ రోజు ప్రతీ ఆడపిల్ల తన అన్నకు గానీ తమ్ముడికి రాఖీ కట్టాలని భావిస్తుంది. సోదరుడు జీవితంలో భయాలను పోగొట్టి ఆపదల నుంచి రక్షిస్తారని నమ్ముతారు. ఢిల్లీకి చెందిన ఓ బాలిక కూడా గత కొన్ని సంవత్సరాలుగా తన అన్నకు రాఖీ కడుతోంది. అయితే ఇటీవల ఆమె అన్న చనిపోయాడు. దాంతో ఈసారి రాఖీ ఎవరికి కట్టాలని, తనకు తన అన్నను మళ్లీ తీసుకురావాలని కోరడం మొదలు పెట్టింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా బాలిక వినక పోవడంతో వారు ఒక ఆలోచన చేశారు. అదే ఇప్పుడు వారిని కటకటాల వెనక్కి పంపించింది.


ఢిల్లీలో నివసించే 41 ఏళ్ల సంజయ్ గుప్తా, 36 ఏళ్ల అనిత గుప్తకు ఇద్దరు సంతానం. అయితే వారి 17 ఏళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు ఇటీవల చనిపోయాడు. వారికి 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే తన అన్న చనిపోయినా చెల్లి మాత్రం అతడిని మరిచిపోలేకపోయింది. దీంతో ప్రతీసారి అన్నకు రాఖీ కట్టినట్లుగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టాలని నిర్ణయించుకుంది. అన్న చనిపోయాడు ఇక తిరిగి రాడు అని చెప్పినా ఆ బాలిక వినిపించుకోలేదు. దీంతో ఆమె చేసే మారం తట్టుకోలేక ఆ భార్యాభర్తలు

ఆగస్టు 24న తెల్లవారుజామున 4:34 గంటల ప్రాంతంలో ఒక వికలాంగ మహిళకు చెందిన నెల వయసు గల మగ శిశువును కిడ్నాప్‌ చేశారు. ఛట్టా రైల్ చౌక్ సమీపంలోని కాలిబాటపై నివసించే నిరాశ్రయులైన దంపతుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబం నిద్రించే ప్రదేశం సీసీ కెమెరాల ద్వారా కవర్ చేయకపోవడంతో, పోలీసులు పక్కనే ఉన్న సుమారు ౪౦౦ సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేసి, ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు ఉన్న మోటార్‌సైకిల్‌ను గుర్తించారు.

అయితే ఆ బైక్ నంబర్ ఆధారంగా సంజయ్‌ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు, భారీ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. సంజయ్ ఇంటిలో కిడ్నాప్ అయిన శిశువుతోపాటు సంజయ్, అనిత దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని పోలీసులు సంజయ్ దంపతులను ప్రశ్నించగా వారు తమ కూతురు రాఖీ కట్టాలన్న కోరిక తీర్చేందుకే చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు అంగీకరించారు. బిడ్డను తమ సొంత కొడుకులా పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నామన్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనితా గుప్తా మెహందీ కళాకారిణి, కాగా సంజయ్ వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్. అయితే సంజయ్‌పై గతంలో మూడు క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.


Tags

Read MoreRead Less
Next Story