Delhi Air Pollution: ఢిల్లీలో దారుణం.. 700 దాటిన AQI

దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. బాణసంచా కారణంగా గాలి నాణ్యత ఇవాళ (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 కంటే ఎక్కువ నమోదైంది. ఆనంద్ విహార్‌లో 714, సిరిఫోర్ట్ – 480, గురుగ్రామ్ – 185, డిఫెన్స్ కాలనీ – 631, నోయిడా – 332, షహదర – 183, నజాఫ్‌ఘర్ – 282, పట్పర్గంజ్ ప్రాంతాల్లో AQI 513గా రికార్డు అయింది. పొగ మేఘాలు కమ్ముకోవడంతో గాలి విషపూరితంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీపావళి సందర్భంగా అక్కడి ప్రజలు బాణాసంచా కాల్చడంతో కాలుష్యం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో క్రాకర్స్ అమ్మడం, కాల్చడం బ్యాన్ విధించినప్పటికీ ఢిల్లీ సరిహద్దులను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పెద్దఎత్తున క్రాకర్స్ కాల్చడంతో ఈపరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.దట్టమైన పొగ మొత్తం కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఫలితం రహదారులు కనిపించడం లేదని సమాచారం. ఊహించిందే జరిగింది. పొగమేఘాలు ఆకాశాన్ని కమ్ముకోగా.. విషపూరితమైన గాలినే పీలుస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చొద్దని ఎంత హెచ్చరించినా.. ప్రజలు పండుగకు పెద్దఎత్తున బాణసంచా కాల్చడంతో పొల్యూషన్ మరింత పెరిగింది. ఇప్పుడు ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ ను తలపిస్తోంది. ఉదయం 5.30 గంటలకు అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)700 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో పొగమంచుతో కలిసి కాలుష్యం కమ్ముకోవడంతో.. రోడ్లు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com