Delhi official Logo: ఢిల్లీకి తొలి సారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ

ఢిల్లీ – పేరుకే దేశ రాజధాని, కానీ ఇప్పటివరకు ఢిల్లీకి ప్రత్యేకంగా చిహ్నం లేదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు తమ ప్రత్యేక గుర్తింపును తెలిపే చిహ్నాలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి గుర్తింపు లేదు. మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం లోగో ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ప్రభుత్వం మొదటి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. నూతన లోగో దేశ రాజధాని చరిత్రలో ఇది ఒక మైలురాయి అవుతుందని అందరూ భావిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ అందరికీ తెలిసిందే, అయితే ఢిల్లీ రాష్ట్రమే అయినా కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల, కేంద్రం యజమాయిషి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వ లోగోలే కనిపిస్తాయి. భారతదేశంలో దేశ రాజధానిగా ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, తనకంటూ ఇప్పటివరకు చరిత్రలో ప్రత్యేక లోగో మాత్రం లేకుండా పోయింది. మొత్తానికి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లోగో ఢిల్లీలోని ఆధునికత, పారదర్శకత, ప్రజా సేవా సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించబడింది. అలాగే, నగరంలోని సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేసేలా లోగోను ప్లాన్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానికి దాని గౌరవానికి తగిన ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” ఢిల్లీ లోగో ఆ ప్రయత్నానికి ప్రతీక అని చెప్తున్నారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా. లోగో ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీని ఒక శక్తివంతమైన బ్రాండ్‌గా స్థాపించడం. ఇది రాజధానిని ప్రజాస్వామ్య విలువలు, సాంకేతిక పురోగతి, పౌర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలబెడుతుందని ఆశిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

