Air Pollution: ఢిల్లీలో ప్రమాదకరస్థాయి మించిపోతున్న వాయు కాలుష్యం.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈరోజు (సోమవారం) ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొనింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక, గురుగ్రామ్‌లో 169, ఫరీదాబాద్‌లో 177గా గాలి నాణ్యత క్షీణించినట్లు చెప్పింది. మరోవైపు దేశ రాజధానిలో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే ఛాన్స్ ఉంది.
ఇక, గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు అని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదికలో తేలింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే కాలుష్యం లేనట్లు.. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.. ఇక, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్తిగా క్షిణించినట్లు అర్థం. అలాగే, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోయిందని.. AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని.. కాగా, ఈ మధ్య ఢిల్లీలో గాలి కాలుష్యం ఆందోళనకరంగా మారిపోతుంది. ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోవడంతో దీపావళికి టాపాకులపై నిషేదం విధించింది అక్కడి ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com