Arvind Kejriwal: నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్ ఇవ్వండి: అరవింద్ కేజ్రీవాల్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ పిటిషన్‌పై జూలై 17వ తేదీన విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి పిటిషన్‌పై గురువారం స్వల్ప విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తనకు ఉపశమనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తాను ఉగ్రవాదిని కాదని కూడా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే కోర్టులో సీబీఐ అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేశారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు.. ED కేసులో దిగువ కోర్టు నుంచి బెయిల్ పొందారు.. అయితే, ఢిల్లీ హైకోర్టు దానిని నిలిపివేయడంతో ఆ తర్వాత ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే, మరోసారి కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఇక, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ వచ్చింది.. ఆ తర్వాతే మళ్లీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని సింఘ్వీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటిత నేరస్థుడు లేదా ఉగ్రవాది కాదు.. మధ్యంతర ఉపశమనం కోసం బెయిల్ అడుగుతున్నాను అంటూ కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది అడ్వకేట్ డీపీ సింగ్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. అతను అరెస్టును సవాలు చేశాడు.. ఇది ఇప్పటికే పెండింగ్‌లో ఉంది అని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com