Rain news : తెలుగు రాష్ట్రాలకు వచ్చే వచ్చే మబ్బులు.. ఢిల్లీలో మోస్తరు వానలు

ఎట్టకేలకు భానుడు శాంతించాడు, తీవ్రమైన ఉష్టోగ్రతలతో సతమతమైన ప్రజలు కాస్త ఊరట చెందారు. పలు రాష్ట్రాల్లో తొలకరి జల్లులు మొదలయ్యాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వచ్చే వారం వరకు దేశ రాజధానిలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేటి ఉదయం తేలికపాటి వర్షం కురిసిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంతో మేల్కొంది రాజధాని, వేడి నుంచి ఉపశమనం పొందింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
ఉత్తర పంజాబ్, హరియాణా, దక్షిణ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కోస్తా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షపాత సూచనలు ఉన్నట్లు ట్వీట్ చేసింది.
Meghalaya, Sikkim, Nagaland, Manipur, Mizoram & Tripura, south Chhattisgarh, Vidarbha, Telangana, Andhra Pradesh and coastal Karnataka during next 2-3 hours. @moesgoi @ndmaindia @DDNewslive @airnewsalerts pic.twitter.com/FV3lDETuCm
— India Meteorological Department (@Indiametdept) June 22, 2023
ప్రాంతీయ వాతావరణ శాఖ (RMC) ఏడు రోజుల అంచనా ప్రకారం, ఢిల్లీలో గురువారం పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం, అతి తేలికపాటి వర్షం/చినుకులు కురిసే అవకాశం ఉందని సూచించింది.

ఈ వారమంతా ఇలాంటి వాతావరణ స్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38, 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
బుధవారం గురుగ్రామ్‌లో కొన్ని గంటలపాటు వర్షం కురిసింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంరాయం కలిగింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న వర్షం కారణంగా ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే (నేషనల్ హైవే 48) జలమయమైంది, గురుగ్రామ్‌లో 5 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ నెలకొంది.
దీంతో ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారు పనులు వదిలేసి, చెరువులను తలిపించిన వీధుల్లో అవస్థలు పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com