Delhi Liquor Scam: రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్

ఢిల్లి లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజేష్ జోషి గౌతమ్ మల్హోత్రా లకు రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది. ఇద్దరి నిందితుల అభియోగాల్లో మనీ లాండరింగ్ సంబంధించిన మెటీరియల్ ఆధారాలు లేవని ప్రత్యేక జడ్జి నాగపాల్ కామెంట్ చేశారు. ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అన్నారు న్యాయమూర్తి. 85 పేజీల ఉత్తర్వులను విడుదల చేసిన కోర్టు..లిక్కర్ స్కాంకు నగదు ఆధారాలు లేవన్న ఉత్తర్వుల్లో తెలిపింది. రాజేష్ జోషి 30 కోట్ల మేర క్విక్ బ్యాక్ కుపాల్పడ్డాడన్న ఈడీ అభియోగాలు మోపింది. అలాగే గౌతమ్ మల్హోత్రా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి మనీ లాండరింగ్ చేశారని ఈడీ ఆభియోగం మోపింది అయితే ఇందుకు సంబందించిన ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది.
గత ఫిబ్రవరిలో జోషి,మల్హోత్రా ఇద్దరినీ ఈ లిక్కర్ స్కాంలో సీబీఐ ఈడీలు అరెస్టు చేశాయి.ఫిబ్రవరి 7న ఈడీ గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసి మద్యం తయారీదారులు హోల్ సేలర్లు,రిటైలర్లు ఏర్పాటు చేసిన సిండికేట్‌లో వీరిద్దరూ భాగమని ఆరోపించింది. గత ఫిబ్రవరి 8న జోషిని అరెస్టు చేశారు. ప్రభుత్వానికి ఎలాంటి సేవలు అందించకుండా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి మనీ లాండరింగ్ మరో నిందితుడికి సహాయం చేసినట్లు ఇతనిపై ఆరోపణలు చేసింది ఈడీ.
మరోవైపు మద్యం కుంభకోణం బోగస్ అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఇప్పుడు కోర్టు కూడా ఎటువంటి కిక్ బ్యాక్, లేదా మనీలాండరింగ్ కు సంబంధించిన మెటీరియల్ ఆధారాలు లేవని చెప్పిందని, కేవలం తమ పార్టీ ప్రతిష్ట మంటగలిపేందుకే బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
ఈడీ సీబీఐల దగ్గర ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబందించి ఒక్క రూపాయి కుంభకోణాన్ని రుజువు చేసేందుకు ఎలాంటి పత్రాలు లేవని అన్నారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి. ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ మంత్రులు, నేతలు చేసిన ఆరోపణలే సీబీఐ ఈడీ చార్జిషీట్లలో ఉన్నాయని. ఈ రెండు సంస్థలు ఆరు నెలలుగా కేసును దర్యాప్తు చేస్తున్నాయని. ఈ కేసును దర్యాప్తు చేయడానికి వారు 500 మంది అధికారులను నియమించారని అన్నారు అయితే ఇంతవరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదని కోర్టు తెలిపిందని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com