Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్‌‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఈడీ రైడ్స్..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్‌‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఈడీ రైడ్స్..
Delhi Liquor Scam : దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కూపీ లాగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేస్తోంది

Delhi Liquor Scam : దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కూపీ లాగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న లిక్కర్ సిండికేట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో సహా మరో ముగ్గురి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

కోకాపేటలోని రాంచంద్ర పిళ్లై ఇంటి నుంచి కీలక పత్రాలను సేకరించారు అధికారులు. ఇండోర్ స్పిరిట్‌ పేరుతో రామచంద్ర పిళ్లై పెద్ద ఎత్తు వ్యాపారం చేస్తున్నారు. టెండర్ దక్కించుకోవడానికి రాంచంద్ర పిళ్లై అక్రమ మార్గం ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అరుణ్ పాండ్యా ద్వారా రెండున్నర కోట్లు వసూలు చేసినట్టు అధికారులు లింక్స్ రాబట్టారు.

మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లల్లో, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే రాబిన్ డిస్టిలర్స్ హెడ్‌ ఆఫీసులోనూ సెర్చ్ చేస్తున్నారు. వీరి ఇళ్లలోనూ లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక ఆధారాలను లభిస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కూపీ లాగే పనిలో పడింది ఈడీ. లిక్కర్ స్కాంలో రాష్ట్రాలకు ఉన్న లింకులు రాబట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 32 ప్రధాన నగరాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, లక్నో, బెంగళూరు, గుర్గావ్‌, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్‌ వ్యవహారంలో తీగ లాగుతున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీ విధానంతో ఆప్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. మద్యం మాఫియాకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా, సహా 15 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమ్‌ అద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది.

Tags

Next Story