Arvind Kejriwal : చిక్కుల్లో కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ED విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వి. కె. సక్సేనా అనుమతి మంజూరు చేశారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎల్జీ ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అలానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై విచారణ జరపడానికి ఇంకా ఎల్జీ ఆమోదం లభించాల్సి ఉందని ED వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఇలాంటి సమయంలో అనుమతి లభించినట్లు వార్తలు రావడంపై ఆప్ మండిపడుతుంది.
కేజ్రీవాల్‌పై గతంలోనే మనీల్యాండరింగ్ కేసు నమోదయినప్పటికీ.. విచారణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నవారిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈడీ లేఖ రాసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన వారసురాలిగా అతిషిని నియమించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మనిష్ సిసోడియాలే కీలకంగా వ్యవహరించారనే ప్రధాన ఆరోపణ. సీబీఐ, ఈడీలు కేసులు నమోదుచేసి పలువుర్ని అరెస్ట్ చేసింది. సిసోడియాను కూడా అరెస్ట్ చేయగా.. 18 నెలలు జైల్లో ఉన్న ఆయన ఈ ఏడాది ఆగస్గులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com