Delhi: ఢిల్లీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్.. ఆప్ పార్టీ విశ్వాస తీర్మానంలో..

Delhi: ఢిల్లీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్.. ఆప్ పార్టీ విశ్వాస తీర్మానంలో..
X
Delhi: ఢిల్లీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. బీజేపీ వ్యూహాలు ఆప్‌ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Delhi: ఢిల్లీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. బీజేపీ వ్యూహాలు ఆప్‌ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ మంత్రి జైల్లో ఉన్నారు. డిప్యూటీ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఐనా బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. బీజేపీ ఒక్క ఆప్‌ ఎమ్మెల్యేను తీసుకెళ్లలేదని తేల్చేశారు. బీజేపీ ఆకర్ష్‌కు విశ్వాస తీర్మానంతో చెక్ పెడతామన్నారు కేజ్రీవాల్.

ఆప్ ఎమ్మెల్యేలెవరూ ఫిరాయించలేదని సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెట్టి నిరూపిస్తానన్నారు. బీజేపీ సీరియల్ కిల్లర్ అంటూ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రలోభాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు లొంగరని.. దీన్ని నిరూపించేందుకు ఈనెల 29న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఆకర్ష్ ఢిల్లీలో పనిచేయలేదని నిరూపించేందుకే విశ్వాస తీర్మానం అంటూ తెలిపారు. పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామని సిపోడియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందన్నారు.

ఒక్కో ఎమ్మెల్యేకు 20కోట్ల ఆశ చూపిందన్నారు. ఐనా ఒక్క ఎమ్మెల్యేను కూడా లొంగదీసుకోలేకపోయిందన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్‌ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా కొద్ది సంవత్సరాలుగా బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుచేసిందన్నారు. ఇందుకు 5వేల 5వందల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఇన్ని వేల కోట్లు బీజేపీకి ఎక్కడివో చెప్పాలని కేజ్రీవాల్ నిలదీశారు.

Tags

Next Story